నిన్న సన్ రైజర్స్ మీద 144 పరుగుల ఛేజింగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి తన ఇంపాక్ట్ చూపించాడు. సరిపోదా శనివారం సినిమాలో నానికి వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లా భగ భగమని రుద్రుడు మండినట్లు మండిపోతూ అసలే తక్కువ స్కోరు కొట్టామనే నీరసంతో ఉన్న హైదరాబాద్ ను మరింత డీలా పడేలా చేశాడు. 46 బాల్స్ ఆడి 8 ఫోర్లు 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. ర్యాన్ రికెల్టెన్, విల్ జాక్స్ తక్కువ స్కోర్లకే అవుటైనా ఆ ప్రభావం ముంబై మీద పడకుండా భారం తన మీద వేసుకుని చెలరేగిపోయాడు. సీజన్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీని సాధించాడు. రోహిత్ శర్మ కొట్టిన మూడు సిక్సుల అందం వర్ణించలేం అసలు. బ్యూటిఫుల్ పుల్ షాట్స్ తో తన లోని వింటేజ్ హిట్ మ్యాన్ ను బయటకు తీసి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేశాడు. లాస్ట్ మ్యాచ్ లో సీఎస్కే మీద 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ...హైదరాబాద్ మీద 70 పరుగులు చేసి తను ఫామ్ లో ఉంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రూవ్ చేశాడు. హిట్ మ్యాన్ ధాటికి నిన్న ముంబై సన్ రైజర్స్ మీద 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించటంతో పాటు 15.4 ఓవర్లలోనే మ్యాచ్ ను ఫినిష్ చేసి భారీగా నెట్ రన్ రేట్ ను పెంచుకుని పది పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానానికి దూసుకొచ్చేలా చేశాడు. తను కెప్టెన్ అయినా కాకపోయినా సరైన టైమ్ లో తను పీక్ అయ్యి 38 ఏళ్ల ఏజ్ లో వింటేజ్ షో తో రఫ్పాడించటంతో పాటు తన ముంబైని దర్జాగా ప్లే ఆఫ్ రేసులో పెట్టాడు ముంబై చా రాజా రోహిత్ శర్మ.